రాజమౌళి కుటుంబంతో ఫాహద్ ఫాజిల్ ప్రత్యేక ఇంటర్వ్యూ

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేయగా, టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబంతో కలిసి ఫాహద్ ఫాజిల్ చేసిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సినిమా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.