'తిరుమలలో రాజకీయాలు కూడ': సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుపతి
తిరుమలలో పవిత్ర భావం ఉండాలని, ఇది రాజకీయాలకు వేదిక కారాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలో ఆధునికీకరించిన మ్యూజియంతో పాటు కొత్తగా 32 ఈవీ బస్సులను ఆయన ప్రారంభించారు. ప్రతి భక్తుడికి ఎల్ఐసీ ద్వారా రూ.2 లక్షల బీమా అందిస్తున్నామని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీవారి స్మరణ తప్ప మరొకటి వినిపించకూడదన్న ఆయన, సేవాభావంతో ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు.