విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా కొనసాగిందని అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల సరళిని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పరిశీలించారు. విజయనగరం నగరపాలక సంస్థలో ఎస్పీ ఏఆర్. దామోదర్ ఆధ్వర్యంలో పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.