బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్ అమానుషం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Jadcherla, Telangana
జూరాల ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళనకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును జడ్చర్లలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల సమస్యలపై మాట్లాడటం నేరంగా మారిందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.