టెండర్ల వివాదం: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ట్రాన్స్ఫార్మర్ల టెండర్లపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించిందని హైకోర్టు వర్గాలు వెల్లడించాయి. టెండర్ నిబంధనల రూపకల్పనలో అక్రమాలు జరిగాయని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం పిల్ వేయడానికి వీల్లేదని షిర్డీసాయి తరఫు న్యాయవాది వాదించారు.