పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన పాలిటెక్నిక్ కరికులం రూపకల్పన
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కోర్సుల్లో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నూతన కరికులాన్ని ఏపీ రాష్ట్ర సాంకేతిక విద్యామండలి తీసుకొచ్చింది. ఇంజినీరింగ్ కోర్సులతో పాటు ఆధునిక సాంకేతిక అంశాలను సబ్జెక్టుల్లో చేర్చగా, ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు ఆడిట్ మరియు క్రెడిట్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు.