ఉదయగిరి ప్రభుత్వ పాఠశాలకు ఏడు లక్షల విలువైన కంప్యూటర్ల వితరణ

రిపోర్టర్: గోపి స్థలం: ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు

ఉదయగిరి మండలం అప్పసముద్రం జడ్పీ ఉన్నత పాఠశాలకు లెరాక్‌ సీఎక్స్‌ టెక్‌ లిమిటెడ్‌ సంస్థ సీఎఫ్‌వో దొడ్డంరెడ్డి జనార్దన్‌రెడ్డి రూ.7 లక్షల విలువైన కంప్యూటర్లు, ఇతర సామగ్రిని శనివారం వితరణ చేశారు. పుట్టిన ఊరిపై మమకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతిక విద్యనందించే ఉద్దేశంతో తొమ్మిది కంప్యూటర్లు, ఫర్నిచర్, బ్యాగులు, స్పోర్ట్స్ మరియు విద్యార్థి కిట్లను ఆయన అందజేశారు.