అమెరికాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం పలికిన ట్రంప్
రిపోర్టర్: గోపి
స్థలం: మేరీల్యాండ్
అమెరికాలోని మేరీల్యాండ్ జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాశంలో బాంబర్ విమానాలు భారీ శబ్దంతో దూసుకెళ్లాయి. ఆ సమయంలో ట్రంప్ ఒక్కసారిగా తల వంచి ముఖం చిట్లించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిన్‌పింగ్ మాత్రం ప్రశాంతంగా కనిపించగా, ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.