భైరిపురంలో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా చైతన్య దుర్గామాతల ప్రదర్శన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బలిజిపేట
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం భైరిపురంలో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో చైతన్య దుర్గామాతల ప్రదర్శన నిర్వహించారు. కన్యలను దేవతామూర్తులుగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ చెడు గుణాలను విడనాడి సద్గుణాలను అలవర్చుకోవాలని తెలిపారు. అంతర్గత శత్రువులను జయించేందుకు రాజయోగ ధ్యానం ఎంతో దోహదపడుతుందని పేర్కొంటూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు.