స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన సన్నద్ధం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు, ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను ఈరోజు ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి. స్థానిక నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేయాలని అధిష్టానం దిశానిర్దేశం చేసింది.