నెల్లూరులో భారీ ప్రాజెక్టు: రామాయపట్నంలో బీపీసీఎల గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పనులకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు సమీపంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టు ఏర్పాటులో అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని అనుమతులు లభించడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, దీనివల్ల ఐదు వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.