రాత్రి సమయంలో సంచరిస్తూ ప్రాణాలు తీస్తున్న అడవి పంది
రిపోర్టర్: jaleel sakshi
స్థలం: సిర్పూర్ (టి)
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) వీక్లీ మార్కెట్ ప్రాంతానికి చెందిన కొత్తూరు వినేష్‌పై రాత్రి అడవి పంది దాడి చేసినట్లు సమాచారం. వినేష్ తన మిర్చి, బజ్జీల బండిని మూసివేసి కూతురితో కలిసి ఇంటికి వెళ్తుండగా, ఇంటి సమీపంలో ఒక్కసారిగా అడవి పంది పరుగెత్తుకుంటూ వచ్చి దాడి చేసి కిందపడేసింది. ఈ ఘటనలో ఆయన కాలు విరిగినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఈ అడవి పంది రాత్రివేళల్లో సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి అడవి పందిని పట్టుకోవాలని కోరుతున్నారు.