ఇందిరాగాంధీ జూ పార్కులో నాలుగు ఆసియా సింహం పిల్లల జననం
రిపోర్టర్: శివ
స్థలం: మధురవాడ
మధురవాడ పరిధిలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో పరిరక్షణ సంతానోత్పత్తి కార్యక్రమంలో భాగంగా నాలుగు ఆసియా సింహం పిల్లలు జన్మించాయి. నెల రోజుల క్రితం పుట్టిన ఈ పిల్లలను తల్లి సింహం సంరక్షణలోనే ఉంచి, నిపుణులైన అధికారులు వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతరించిపోతున్న అత్యంత అరుదైన ఆసియా సింహాల జాతిని కాపాడుకోవడంలో ఈ జననం కీలక విజయమని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు.