ఓటుకు వెయ్యి ఇచ్చినా మోసం చేశారు: డబ్బులు వెనక్ కి ఇవ్వాలని వైకాపా అభ్యర్థి డిమాండ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పలమనేరు
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో ఎన్నికల్ లో ఓటమిపాలైన వైకాపా అభ్యర్థి ప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. తాను ఎన్నికల కోసం అప్పు చేసి ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ చేశానని, అయినా ఓడించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని తనకు ఓటేయని వారంతా నగదు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ ప్రసాద్‌రెడ్డి సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసినట్లు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు.