అమరావతి ఉద్యమకారుడు ధనేకుల రామారావు కన్నుమూత

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆంధ్రప్రదేశ్

అమరావతి జేఏసీ కీలక నేత, ఉద్యమకారుడు ధనేకుల రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. రాజధాని సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు, అక్రమ కేసులను ఎదుర్కొని జైలుకెళ్లిన వైనాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్మరించుకున్నారు. రామారావు మృతి పట్ల రాజధాని ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొనగా, ప్రముఖులు సంతాపం తెలిపారు.