టెక్ మార్కెట్లోకి వివో వై32 5జీ ఫోన్: శక్తివంతమైన ఫీచర్ల విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో మార్కెట్లోకి కొత్తగా వివో వై32 5జీ ఫోన్ ను అధికారికంగా లాంచ్ చేసినట్లు కంపెనీ నిపుణులు తెలిపారు. ఈ సరికొత్త మొబైల్ 8,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తున్నట్లు వెల్లడించారు. అలాగే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ తో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.87 అంగుళాల డిస్ ప్లేను అమర్చినట్లు పేర్కొన్నారు.