కొత్తవలసలో ఘనంగా ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఎన్జీసీ సమన్వయకర్త బి. వేణుగోపాలరావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఓజోన్ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీహెచ్.ఈశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.