జంతర్‌మంతర్ ఆందోళన హింసపై విచారణకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలో హింస, పెల్లెట్ గన్స్ వాడకంపై విచారణ జరపాలని ఉన్నత స్థాయి కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీ మార్పు కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. నిష్పక్షపాత విచారణకు హామీ ఇస్తూ, ఆందోళనలో పాల్గొన్న బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.