సమాధాన్ పోర్టల్ ద్వారా కార్మికుల ఆన్లైన్ ఫిర్యాదులకు సులభంగా పరిష్కారం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Andhra Pradesh / Telangana
కార్మికులు తమ సమస్యలను ఆన్లైన్ ద్వారా సులభంగా నమోదు చేసుకొని పరిష్కారం పొందవచ్చని Ministry of Labour & Employment, GoI స్పష్టం చేసింది. సమాధాన్ పోర్టల్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ఫిర్యాదులు సమర్పించవచ్చని పేర్కొంది. ఈ సేవలను కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. పారదర్శకమైన విధానంలో సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు.