పంటల సాగులో సిసలైన సిరులు కురిపించే మైఖోరైజా వినియోగం
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మైఖోరైజా వినియోగంపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ పాల్గొని రైతన్నలకు మైఖోరైజా వాడే విధానం, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇది వేరు వ్యవస్థను బలోపేతం చేసి, పోషకాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సిహెచ్. తిరుపతి, సర్పంచ్ చిలుముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.