ఇంద్రకీలాద్రి దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలపై నారా లోకేష్ ప్రత్యేక శుభాకాంక్షలు
రిపోర్టర్: శివ
స్థలం: గుంటూరు
కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల శోభ వైభవంగా సాగుతోందని నారా లోకేష్ వెల్లడించారు. భక్తులను ఎల్లవేళలా కాపాడే బెజవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పవిత్ర శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలు ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.