తిరుమలలో క్యూలైన్లలో వేచివున్న భక్తులకు టీటీడీ వసతులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Tirumala
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్న దృష్ట్యా బయట క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలతో పాటు నిరంతరం అల్పాహారాన్ని అందిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, అత్యవసర వైద్య సేవలందిచేందుకు మొబైల్ క్లినిక్లను కూడా అందుబాటులో ఉంచామని, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ పాలకమండలి స్పష్టం చేసింది.