కేరళ హైకోర్టు కీలక తీర్పు: సీసీటీవీ ఫుటేజ్ కాపీలు ఇవ్వబోమని స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Kerala
నిందితుడి రక్షణ హక్కుతో పాటు బాధితురాలి గోప్యతను కూడా కాపాడాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పోక్సో కేసు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ కాపీలు ఇవ్వలేమని, అయితే కోర్టు హాల్ లో దానిని పరిశీలించుకోవడానికి అడ్వకేట్ కు అనుమతి ఇస్తామని జస్టిస్ జోబిన్ సెబాస్టియన్ వెల్లడించారు. కొట్టారకర ప్రత్యేక కోర్టులో ఈ నిబంధనను అమలు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.