తొమ్మిదో తరగతి గణితం సామాజిక శాస్త్ర కొత్త పాఠ్యపుస్తకాలు విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
దేశంలో విద్యా సంస్కరణల్లో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తొమ్మిదో తరగతికి సంబంధించిన రెండు కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. గణితం పార్ట్ 2 పుస్తకం సెప్టెంబర్ 21 నుంచి, సామాజిక శాస్త్రం పార్ట్ 2 పుస్తకం సెప్టెంబర్ 30 నుంచి అందుబాటులో ఉంటాయని ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా వీటిని రూపొందించారు.