నర్సీపట్నం బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందన్న ఉమాశంకర్ గణేష్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నంలో వైయస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల అనిత ప్రచారాన్ని ముమ్మరం చేయగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పాల్గొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. నర్సీపట్నానికి రావాల్సిన రూ. 267 కోట్ల బకాయిలపై ప్రభుత్వం ఎప్పుడు సమాధానం చెబుతుందని నిలదీస్తూ ప్రజలు వైయస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.