టేకులపల్లిలో యువతి వేధింపుల కలకలం: ప్రశ్నించిన సోదరుడిపై ఘర్షణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: టేకులపల్లి
టేకులపల్లి మండలంలో యువతిని వేధిస్తున్నాడనే విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లిన ఆమె సోదరుడితో ఓ వ్యక్తి ఘర్షణకు దిగినట్లు బోడు ఏఎస్ఐ నాగయ్య తెలిపారు. చింతొని చెలక గ్రామానికి చెందిన యువతిని వజ్జోనిగూడెంకు చెందిన వజ్జ ప్రభాకర్ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనపై యువతి తల్లి కంభంపాటి ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ నాగయ్య వెల్లడించారు.