ముద్దు సన్నివేశాలపై నిర్మాత నాగవంశీ స్పందన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
యువ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ చిత్రంపై ట్రైలర్లో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాల విమర్శలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. సినిమాలో ముద్దు సన్నివేశం ఉన్నంత మాత్రాన దానిని అడల్ట్ ఫిల్మ్ అనడం సరికాదని, కథలో భాగంగానే రొమాన్స్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులు కూడా కలిసి చూడదగ్గ ప్రేమకథా చిత్రమని తెలిపారు.