మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘరానా దొంగల అరెస్ట్: ఐదుగురు నిందితులు రిమాండ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో వరుస వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ దొంగతనాలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల నుంచి భారీగా దొచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రజలు తమ వాహనాల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.