అన్నదాతలకు ఘన గౌరవం: మేఘాలయలో ఆరుగురు రైతులకు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం
రిపోర్టర్: అశోక్
స్థలం: Shillong
వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన మేఘాలయకు చెందిన ఆరుగురు రైతులకు కృషి గౌరవ్ సమ్మాన్ పురస్కారాలు లభించాయని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్నియమ్ లోని సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. చిరుధాన్యాల సాగు, సంప్రదాయ పంటల పరిరక్షణ, గ్రామీణ పారిశ్రామికీకరణ రంగాల్ లో సేవలు అందించిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గతంలో వీరి సేవలను అభినందించడం విశేషం.