దువ్వాడ పోలీసుల ప్రత్యేక చొరవతో గంటలోనే అదృశ్యమైన బాలుడి ఆచూకీ
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
బాలుడు అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే దువ్వాడ సీఐ గణేశ్ ఆదేశాల మేరకు ఎస్ఐ నేతాజీ స్పందించారు. హెచ్సీ బాలకృష్ణ, కానిస్టేబుల్ నర్సింగరావుతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సాతవాహననగర్ కు చెందిన 13 ఏళ్ల మొహంతి ధరణిసాయి హోంవర్క్ చేయలేదనే భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గంటలోనే బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.