నగరంలో ఉచిత వైద్య శిబిరాలతో ఆయుర్వేద వారోత్సవాలు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పలు ఆరోగ్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముస్తఫానగర్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు పరీక్షలు, ఆరోగ్య సూచనలు అందించారు. శాంతినగర్ అంగన్వాడీలో పోషకాహారంపై అవగాహన కల్పించారు. వెలుగుమట్ల పార్కు, ఆయుర్వేద డిస్పెన్సరీలో ఔషధ మొక్కలు నాటారు. సెప్టెంబర్ 23న ఖానాపురం యూపీహెచ్సీ కాలనీ సమీపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు.