సోషల్ మీడియా ట్రోల్స్‌పై నటి రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై నటి రష్మిక మందన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండతో బంధంపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తాము ఇష్టపడి కలిసికట్టుగా అడుగులు వేస్తున్నామని, అవసరమైతే వేయిసార్లు ప్రపోజ్ చేయడానికి వెనుకాడబోమని రష్మిక స్పష్టం చేశారు. కష్టకాలంలో తనకు విజయ్ మాత్రమే అండగా నిలిచారని ఆమె తెలిపారు.