నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వెంకన్నబాబు హెచ్చరిక

రిపోర్టర్: గోపి స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు డీఎస్పీ వెంకన్నబాబు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు ఇకపై ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, చట్టాన్ని అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని స్పష్టం చేశారు.