ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన ఆర్చర్ చికితకు అభినందనలు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మిక్స్డ్ కాంపౌండ్ ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించి, 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తితో పాటు సాహిల్ జాదవ్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాభినందనలు తెలిపారు. ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ విజయం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.