తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏల విడుదలకు అంగీకారం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది. మొదటి డీఏను 3.46 శాతం, రెండో డీఏను 2.74 శాతంతో చెల్లించనున్నట్లు తెలిపారు. అలాగే పీఆర్సీ నివేదిక సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందే అవకాశం ఉందని, సీపీఎస్ రద్దుపై ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.