వృద్ధుడిని బెదిరించి కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
మీపై కేసులు ఉన్నాయంటూ బెదిరించి ఎనభై ఒక్క ఏళ్ల విశ్రాంత ఉద్యోగి నుంచి పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను సైబర్ మోసగాళ్లు కాజేశారని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. విజయవాడలోని పటమట గురునానక్ కాలనీకి చెందిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే స్పందించిన అధికారులు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయించారు. నగదు బదిలీ అయిన ఖాతాలు ఉత్తర్ప్రదేశ్, పశ్చిమబెంగాల్లలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి తదుపరి దర్యాప్తు చేపట్టారు.