శ్రీ విశ్వభారతి స్కూల్పై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మవద్దు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు అర్బన్ ప్రాంతంలోని శ్రీ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్పై సోషల్ మీడియాలో కొందరు నిరాధారమైన తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అదే పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థి గుణ్ణం వెంకట ఫణిత్ కుమార్ రెడ్డి ఈ వదంతులను తీవ్రంగా ఖండించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, యాజమాన్యం విద్యార్థులకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తారని, ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.