తెలంగాణ ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు సెప్టెంబర్ 5 చివరి తేదీ
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 5తో ముగియనుంది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ప్రింట్‌అవుట్‌ను సెప్టెంబర్ 8లోగా డీఈవో కార్యాలయంలో సమర్పించాలి. ఎంపికైన వారికి 4 ఏళ్ల పాటు నెలకు రూ. 1000 చొప్పున మొత్తం రూ. 48,000 ఆర్థిక సాయం అందుతుంది. నవంబర్ 1న స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహించనున్నారు.