హైదరాబాద్లో ఘనంగా వేల్ సినిమా ట్రైలర్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాత్సవ జంటగా నటిస్తున్న 'వేల్' సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. క్షత్రియ ప్రొడక్షన్స్ బ్యానర్పై జి. అశోక్, వై మురళి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగేంద్ర ఆవుల దర్శకత్వం వహిస్తున్నారు. గోవా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్, యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.