ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారని ఫైర్
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సీఎం జ్ఞానేశ్ కుమార్ తొలగింపును కోరుతూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఆందోళన కార్యక్రమాలకు వివిధ ప్రజా సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి.