మహిళా పారిశ్రామికవేత్తలకు భారీ ఊరట: ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమిట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆమె స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాలలో రాణించేలా పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు కల్పిస్తామని, స్టార్టప్ లకు పూర్తి స్థాయిలో విధానపరమైన సహకారం అందిస్తామని ఆమె తెలిపారు.