భారీ వర్షాలకు హుకుంపేటలో మునిగిన పంటలు దెబ్బతిన్న వంతెన

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: హుకుంపేట

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మారుమూల గ్రామాల్లో విస్తారంగా సాగు చేసిన పంట పొలాలు నీట మునిగి అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు వాగులు పొంగిపొర్లడంతో వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక సిడ్డిపుట్టు వంతెన స్వల్పంగా దెబ్బతినడంతో అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.