పశువులు సెల్ ఫోన్ల దొంగలపై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

రిపోర్టర్: సురేష్ స్థలం: Telangana

పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి దొంగిలించడంతో పాటు సెల్ ఫోన్ దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరాచకాలపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఈ నేరాలకు పాల్పడుతున్న దుండగులు చోరీ చేసిన సొత్తును ఏకంగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన హెచ్చరించారు.