తిరుమలలో స్మార్ట్ బస్టాపుల ఏర్పాటుకు టీటీడీ అధికారుల ప్రత్యేక ప్రణాళికలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Tirumala

తిరుమలలో భక్తుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు టీటీడీ అధికారులు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉచిత ధర్మ రథం బస్సుల సమాచారాన్ని అందించేలా ఇరవై ప్రధాన బస్టాపులను క్యూఆర్ కోడ్ విధానంతో స్మార్ట్గా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు మొబైల్ ద్వారా కోడ్ను స్కాన్ చేసి బస్సుల సమయాలు, రూట్లను సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.