సదాశివపేటలో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి
రిపోర్టర్: రమేష్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సిద్ధాపూర్ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ పాఠశాల బస్సు కిందపడి రెండేళ్ల బాలుడు ఎఫ్రాయిమ్ ప్రాణాలు కోల్పోయాడు. అన్నయ్యను ఇంటికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చిన చిన్నారి, బస్సు టైర్ కిందబడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.