విజయవాడలో స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దౌర్జన్యాన్ని ఖండించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: విజయవాడ
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడటాన్ని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడించి ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులను అవమానించడం బాధాకరమని, నిబంధనల ప్రకారం పరిశీలన జరపాల్సింది పోయి దాడులకు యత్నించడం దారుణమని ఆయన పేర్కొన్నారు.