ఖమ్మంలో అంబాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా చిన్న స్కూల్ బజార్లోని జీల్లచెరువు ప్రాంతంలో అంబాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానికులు పాల్గొని పండుగ ఆనందాన్ని ఘనంగా పంచుకున్నారు.