రికార్డుల మోత మోగిస్తూ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లీ
రిపోర్టర్: విజయ్
స్థలం: Auckland
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డులను సృష్టించినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. వన్డే ఛేజింగ్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశారు. అలాగే మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్ గా చరిత్రకెక్కారని క్రీడా విశ్లేషకులు తెలిపారు.