శాప్ కార్యాలయాలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గమన్న మంత్రి పార్థసారధి
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
శాప్ కార్యాలయాలపై వైసీపీ గూండాలు దాడి చేయడం అత్యంత దుర్మార్గమని మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. జగన్ అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ఫేక్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏపీపీఎస్సీ పేపర్లను ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లతో దిద్దించిన జగన్ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తోందని మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శించారు.