భాజపా బలోపేతమే ప్రతి కార్యకర్త లక్ష్యం కావాలి: అరవింద్ సింగ్ బదోరియా
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
పార్టీ బలోపేతమే ప్రతి కార్యకర్త ప్రధాన లక్ష్యం కావాలని భాజపా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అరవింద్ సింగ్ బదోరియా స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పదవి కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యమని గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.